
ముందస్తుగానే వైన్స్ టెండర్లు!
జనాభా ఆధారంగా షాపులకు ఫీజు..
నల్లగొండ : మద్యం దుకాణాల కేటాయింపునకు ఈసారి కూడా ప్రభుత్వం ముందస్తుగానే టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండు సంవత్సరాల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. టెండర్ ఫీజు మినహా.. గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్ని ఈసారి కూడా అమలుపరచనుంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునేందుకు అవకాశం ఉండడంతో మద్యం వ్యాపారులు, ఆశావహులు టెండర్లు వేసేందుకు సిద్ధవుతున్నారు.
రిజర్వేషన్ అమలు
రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీల వారీగా దుకాణాలను కేటాయించనున్నారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్ల వెసులుబాటుతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
కమిషనర్ ఉత్తర్వుల తర్వాత దరఖాస్తులు
ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లైసెన్స్‌ల జారీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిపికేషన్ అనంతరం వచ్చే రెండేళ్లకు మద్యం షాపుల లైసెన్స్‌ల జారీ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు తీసుకోవాలి. ఎప్పుడు డ్రా తీయాలనే విషయంపై కలెక్టర్లకు ఆదేశాలు రానున్నాయి. అయితే సెప్టెంబరు 2వ వారంలోపు షెడ్యూల్ విడుదల చేసి ఆ నెల మొత్తం దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయించనుంది. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ డ్రా తీయనున్నారు.
జిల్లాలో 155 మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన షాపులకు పీజు ఉంటుంది. రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్‌లలో లైసెన్స్‌దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫ 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు
ఫ 5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు
ఫ 50వేల నుంచి లక్ష జనాభాకు
రూ.60లక్షలు
ఫ లక్ష నుంచి 5 లక్షల వరకు
రూ.65లక్షలు
ఫ 5లక్షల నుంచి 20లక్షల జనాభాకు రూ.85లక్షలు
ఫ 20లక్షల పైచిలుకు జనాభా ఉంటే రూ.కోటి 10లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల
నుంచి రూ.3 లక్షలకు పెంపు
ఫ సెప్టెంబర్ రెండో వారంలోపు షెడ్యూల్, అదే రోజునుంచి
దరఖాస్తుల స్వీకరణ
ఫ అక్టోబర్‌లో డ్రా పద్ధతిన
కేటాయింపు
ఫ డిసెంబరు నుంచి కొత్త వైన్స్‌ల నిర్వహణకు అవకాశం
ఫ జిల్లాలో 155 మద్యం దుకాణాలు