అవసరం ఉన్న రైతులకే యూరియా | - | Sakshi
Sakshi News home page

అవసరం ఉన్న రైతులకే యూరియా

Aug 21 2025 8:44 AM | Updated on Aug 21 2025 8:44 AM

అవసరం ఉన్న రైతులకే యూరియా

అవసరం ఉన్న రైతులకే యూరియా

మిర్యాలగూడ : జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్‌ టన్నుల యూరియాను అసవరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో యూరియాపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. మంగళవారం రాత్రి జిల్లాకు 510 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని, ఈ యూరియాను ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అసవరం ఉన్నంత మేరా కేటాయించామన్నారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగొద్దని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అనవసరం లేని రైతులు యూరియాను నిల్వ ఉంచుకోవద్దని సూచించారు. యూరియా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా వాడపల్లి చెక్‌పోస్టు వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ను ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో మొత్తం 19500 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు సుమారు 14వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ వివరించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని సహకార సంఘాల్లో ఎరువులు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement