
ఉత్తమ ఉపాధ్యాయులుగా నాజ్‌నీన్, శంషున్నిసా
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన బయాలజికల్ సైన్స్ టీచర్(స్కూల్ అసిస్టెంట్) నాజ్‌నీన్ ఖుర్షీద్, ఉర్దూ టీచర్(స్కూల్ అసిస్టెంట్) శంషున్నిసా బేగం రాష్ట్రస్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. బుధవారం వారిని హైదరాబాద్‌లోని తెలంగాణ ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందన్, తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఫ్ అన్సారి, తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ శాలువాలు, పూలమాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. తమ పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు రాష్ట్ర స్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వంగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు ఏడబ్ల్యూఎస్ రాబియా అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయూబ్‌ఖాన్, షేక్ బాబా, అతియా, ఆర్. ప్రవీణ, ఇర్షత్ ఫర్హీన్, పీఈటీ అష్రఫ్ అహ్మద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా నాజ్‌నీన్, శంషున్నిసా