మరో 10,311 ఇందిరమ్మ ఇళ్లు
నల్లగొండ : జిల్లాకు రెండో విడతలో 10,311 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మొదటి విడతలో 1,753 ఇళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇక, రెండు విడతల్లో కలుకుని ఇప్పటివరకు మొత్తం 12,064 ఇళ్లు మంజూరయ్యాయి.
సిద్ధమవుతున్న అర్హుల జాబితా
జిల్లాలోని నియోజకవర్గాల్లో మొత్తం 17,500 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు విడతల్లో కలుపుకుని 12,064 ఇళ్లు మంజూరు కాగా.. మిగిలిన ఇళ్లకు సంబంధించి కూడా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు లిస్టు తయారు చేస్తున్నాయి. వాటన్నింటిని మండల స్థాయిలో గెజిటెడ్ అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి అప్రూవల్‌తో కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందించనున్నారు.
ఫ రెండో విడత మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ మొదటి విడతలో 1,753 ఇళ్లు.. వివిధ దశల్లో వాటి నిర్మాణాలు
గ్రామాల్లో పూర్తయిన సర్వే..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం గ్రామాల్లో సర్వే నిర్వహించింది. ఎల్–1 (ఇంటి స్థలం ఉండి ఇల్లులేని వారు), ఎల్–2 (ఇంటి స్థలం, ఇల్లు లేనివారు), ఎల్–3 (పక్కా ఇల్లు ఉన్నవారు) ఇలా మూడు జాబితాలను తయారు చేసింది. మొదటగా ఎల్–1 జాబితాలో ఉన్నవారికి ఇళ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం మొదటి విడతలో ఆయా గ్రామాలకు 1,753 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 591 ఇళ్ల నిర్మాణానికి మార్క్ చేయగా.. 238 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో, 3 ఇళ్లు రూప్‌లెవెల్‌లో ఉన్నాయి. కొన్ని ఇళ్లకు బెస్‌మెంట్ బిల్లు కూడా చెల్లించింది.
నిర్మాణంలో నిబంధనలు పాటించాలి
ఇందిరమ్మ ఇళ్లు నిబంధనల ప్రకారం నిర్మించాలి. ఇప్పటికే రెండో విడతల్లో 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడత ఇళ్ల నిర్మాణం వివిద దశల్లో ఉంది. కొన్ని ఇళ్లకు పేమెంట్లు కూడా చేశాం. మిగిలిన ఇళ్లను ఇందిరమ్మ కమిటీల సిఫారసు మేరకు పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తాం. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించి ప్రభుత్వం నుంచి డబ్బులు పొందాలి.
– రాజ్‌కుమార్, హౌసింగ్ పీడీ
మరో 10,311 ఇందిరమ్మ ఇళ్లు


