
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
హాలియా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితులతోపాటు గంజాయి ఇతర మాదకద్రవ్యాలు విక్రయించేవారి సమాచారాన్ని విలేజ్ పోలీస్ అధికారి అందించడం వల్ల నేరాలను నిరోధించవచ్చన్నారు. గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, హాలియా సీఐ జనార్దన్ గౌడ్, ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, వీపీఓ సరిత తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరతచంద్ర పవార్