
64,884 మందికి రేషన్ కార్డులు
నల్లగొండ: కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటన్నింటిని పరిశీలించి గతనెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మొత్తంగా 72,100 మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోగా 64,884 దరఖాస్తులను అప్రూవల్ చేసి లబ్ధిదారులకు అందించారు. మిగతావి వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
పేర్లు చేర్చేందుకు 87,122 అర్జీలు
రేషన్ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు 87,122 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 82,185 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో వాటిల్లో కొత్తగా పేర్లు చేర్చారు. మిగతావి ఆర్‌ఐ, తహసీల్దార్, డీఎస్‌ఓ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి.
ఫ పూర్తయిన పంపిణీ ప్రక్రియ
ఫ కొత్త కార్డులకు
సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులేని అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హతల ప్రకారం కొత్త కార్డు మంజూరు చేస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ