
ముంచెత్తిన వాన
జిల్లా అంతటా జోరు వర్షం
ఫ శాలిగౌరారంలో అత్యధికంగా 14.1 సెంటీమీటర్లు నమోదు
ఫ పలుచోట్ల పొంగిన వాగులు.. రాకపోకలకు అంతరాయం
ఫ పత్తి చేలలో నిలిచిన నీరు
పెద్దవూర, తిరుమలగిరి(నాగార్జునసాగర్), త్రిపురారం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 14.1 సెంటీమీటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా నాంపల్లి మండలంలో 8.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. వర్షంతో పలుచోట్ల పత్తి చేలలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగాయి. దీంతో లోలెల్ వంతెనల పైనుంచి వరద నీరు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. మొన్నటి వరకు వేసవిని తలపించేలా ఎండలు ఉండటంతో పత్తి, మిరప చేలు వాడు దశకు చేరుకున్నాయి. ఈ వర్షంతో పంటలకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నీటమునిగిన చేలు
● పెద్దవూర మండలంలో కురిసన భారీ వర్షంతో మండలంలోని పెద్దవూర, నాయినివానికుంట, సంగారం, పోతునూరు చెరువులు అలుగులు పో స్తున్నాయి. పెద్దవూర–పర్వేదుల రహదారిపై మండల కేంద్రంలో చిన్నవాగుపై ఉన్న వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో నీటిలోనుంచే పశువులు, వాహనాలు వెళ్లాల్సి వచ్చింది.
● తిరుమలగిరి సాగర్‌లో సుమారు గంట పాటు భారీ వర్షం కురింసింది. మండలంలో చాలా గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. పత్తి పంట చెరువును తలపించేలా మారాయి.
● త్రిపురారం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురి సింది. దీంతో మండల కేంద్రం నుంచి కుక్క డం వెళ్లే రహరారిలో బాబుసాయిపేట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శాలిగౌరారంలో కుండపోత
శాలిగౌరారం : మండలంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. వరదలకు మండల కేంద్రంలో కాల్వలకు గండ్లు పడటంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఊట్కూర్ వద్ద కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్, పెర్కకొండారం, ఇటుకలపాడ్, వంగమర్తి గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వందల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఊట్కూర్ నుంచి బండమీదగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో బండమీదగూడెం వెళ్లడం కష్టతరంగా మారింది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన ముగ్గురు తాపిమేసీ్త్రలు ఊట్కూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముగించుకుని బైక్‌పై తిరిగి వెళుతుండగా ఊట్కూర్ మాదారంకలాన్ గ్రామాల మధ్య కాజ్‌వేపై వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వారిని తాళ్ల సాయంతో బయటకు లాగి ప్రాణాపాయం తప్పించారు. శుక్రవారం ఉదయం బైక్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
వర్షపాతం వివరాలు ఇవీ..
నల్లగొండ టౌన్ : చిట్యాల 49.1మి.మీ, నార్కట్‌పల్లి 35.5, కట్టంగూర్ 60.3, నకిరేకల్ 42.5, కేతేపల్లి 31.9, తిప్పర్తి 11.9, నల్లగొండ 47.5, కనగల్ 15.2, అనుముల హాలియా 41.7, నిడమనూరు 26.8, త్రిపురారం 36.8, మాడ్గులపల్లి 25.5, వేములపల్లి 59.1, మిర్యాలగూడ 15.8, దామరచర్ల 24.5, అడవిదేవులపల్లి 45.4, తిరుమలగిరి సాగర్ 26.7, పెద్దవూర 37.8, చింతపల్లి 19.5, గుర్రంపోడు 11.5, పీఏపల్లి 26.8, నేరడుగొమ్ము 10.8, కె.మల్లేపల్లి 16.8, దేవరకొండ 27.6, గుండ్లపల్లి 56.9, చందంపేట 18.0, గుడిపల్లి 17.7, మునుగోడు 22.8, చండూరు 21.6, గట్టుప్పల్ 10.3, మర్రిగూడ మండలంలో 9.4 మిలీమీటర్ల వర్షం కురిసింది.

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన