
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
దేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు పురోగతి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇల్లు మంజూరై నిర్మించుకు నేందుకు ఆర్థిక స్థోమత లేని వారిని గుర్తించి వారికి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్ల పురోగతిని పరుగులు పెట్టించాలని అధికారులకు సూచించారు. జాబితాలో అర్హులైన వారిని చేర్చాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి