మిర్యాలగూడ : అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ బైపాస్‌లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైపాస్‌లోని వై జంక్షన్ వద్ద నుంచి నందిపాడు చౌరస్తా మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వై జంక్షన్, నందిపాడు చౌరస్తా, రవీంద్రనగర్ క్రాస్‌రోడ్డు, చింతపల్లి బైపాస్, ఈదులగూడ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని ఆరు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారని, కానీ ఇంతవరకు పనులను మొదలు పెట్టలేదన్నారు. వెంటనే పనులు ప్రారంభించకుంటే నిరాహార దీక్షలు చేపతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, గాదె పద్మ, రవినాయక్, గౌతంరెడ్డి, మంగారెడ్డి తదితరులున్నారు.


