మహిళలకే పనిముట్లు | - | Sakshi
Sakshi News home page

మహిళలకే పనిముట్లు

Mar 23 2025 9:19 AM | Updated on Mar 23 2025 9:14 AM

మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ

లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాము..

2018 నుంచి వ్యవసాయ యాంత్రికరణ పథకం నిలిచిపోయింది. దీంతో రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పఽథకాన్ని పునరుద్ధరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ పరికరాల కోసం మహిళా రైతుల నుంచి తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారుల ఎంపిక వ్యవసాయ శాఖ అధికారులకు కత్తిమీది సాములా మారనుంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను గుర్తించి ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నెలాఖరు వరకు గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశాలు

నియోజకవర్గాల వారీగా యూనిట్లు, నిధుల కేటాయింపు

50 శాతం రాయితీపై అందజేత

నల్లగొండ అగ్రికల్చర్‌ : వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించడంతో పాటు ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్‌ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్వవసాయ శాఖ అన్ని నియోజకవర్గాల వారీగా పరికరాలను, నిధులను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అనుమతిలో కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు.

నియోజకవర్గాల వారీగా పరికరాలు,

నిధుల ఇలా.. (రూ.లక్షల్లో..)

నియోజకవర్గం పరికరాలు నిధులు

నాగార్జునసాగర్‌ 138 31.70

దేవరకొండ 134 30.05

మిర్యాలగూడ 139 27.83

మునుగోడు 119 22.44

నకిరేకల్‌ 129 29.35

నల్లగొండ 140 36.83

తుంగతుర్తి

(శాలిగౌరారం) 21 3.16

మొత్తం 820 181.36

లబ్ధిదారులను ఎంపిక చేస్తాం

వ్యవసాయ యాంత్రికరణ పరికరాల గ్రౌండింగ్‌ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నియోజక వర్గాల వారీగా పరికరాలతో పాటు నిధుల కేటాయింపు పూర్తి చేశాం. త్వరలో మహిళా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాల గ్రౌండింగ్‌ చేస్తాం.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌, డీఏఓ

మహిళలకే పనిముట్లు1
1/2

మహిళలకే పనిముట్లు

మహిళలకే పనిముట్లు2
2/2

మహిళలకే పనిముట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement