రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ నుంచి నార్కట్‌పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది.