పట్టాలెక్కని పనులు! | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని పనులు!

Mar 13 2025 11:32 AM | Updated on Mar 13 2025 11:28 AM

నిర్మాణానికి నోచని ఆర్‌యూబీ, ఆర్‌ఓబీలు

ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ

నిర్మించాలని కోరిన ప్రాంతాలివే..

● నల్లగొండ జిల్లా రాయినిగూడెం వద్ద, తిప్పర్తి సెక్షన్‌లోని ముకుందాపురం 56వ లెవల్‌ క్రాసింగ్‌వద్ద, ఎఫ్‌సీఐ గోదాం నుంచి పెద్దబండ నుంచి నామ్‌ రోడ్డులో 45వ లెవల్‌ క్రాసింగ్‌ వద్ద నిర్మించాలని కోరారు.

● రామన్నపేట – చిట్యాల సెక్షన్‌లోని, కి.మీ 0/4–6 వద్ద, చిట్యాల మున్సిపాలిటీ – కాటన్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ రోడ్‌లో, దామరచర్ల – వీర్లపాలెం రోడ్డులోని రోడ్డు 86వ క్రాసింగ్‌ వద్ద ఆర్‌ఓబీ లేదా ఆర్‌యూబీ నిర్మించాలని విన్నవించారు.

● త్రిపురారం – కుక్కడం రోడ్డులో, పగిడిపల్లి నుంచి నడికుడి విభాగంలోని పెద్దదేవులపల్లి వెళ్లే మార్గంలో 64వ క్రాసింగ్‌ వద్ద బ్రిడ్జి అవసరమని పేర్కొన్నారు.

● యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ – నాగారం రోడ్డులో, పగిడిపల్లి – భువనగిరి రోడ్డులోని రోడ్డులో, ముత్తిరెడ్డిగూడెంలో, అలేరు– పెంబర్తి రోడ్డులో, వలిగొండ – రామన్నపేట రోడ్డులో వీటిని నిర్మించాలని కోరారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీలు (ఆర్‌వోబీ), రోడ్‌ అండ్‌ బ్రిడ్జీల (ఆర్‌యూబీ) నిర్మాణం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమతం అవుతోంది. ఏటా కేంద్ర రైల్వే బడ్జెట్‌ కంటే ముందు, రైల్వే బోర్డు సమావేశాల సమయంలో జిల్లాలోని ఎంపీలు ప్రతిపాదనలు ఇవ్వడం, అవి అమలుకు నోచుకోకపోవడం ఆనవాయితీగా మారుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంది. మరోవైపు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య ఈనెల 8వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు ఆమోదం తెలుపాలని విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ ప్రాజెక్టులపై ప్రత్యేక విజ్ఞప్తి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. జిల్లాలో పలు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా రైల్వే నిధులతో ఆర్‌ఓబీలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ అందజేశారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని వివరించారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఆయా పనులకు మోక్షం లభిస్తుందా? ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. లేదా ఎప్పటిలాగే ప్రతిపాదనలకే పరిమితం అవుతాయా? వేచి చూడాల్సిందే.

ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా?

మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ రూ.458.26 కోట్లతో మంజూరుచేసినా ఈసారి నిధులను బడ్జెట్‌లో కేటాయించలేదు. విష్ణుపురం–జాన్‌పహడ్‌ 11 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు డబ్బులు ఇవ్వలేదు. నల్లగొండ– శ్రీరామ్‌పురం 123వ బాక్స్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను ఇవ్వలేదు. ఇక డోర్నకల్‌ – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్‌ పనులు సర్వేకే పరిమితమయ్యాయి. మిర్యాలగూడ, కోదాడ, నేరేడుచెర్ల, హుజూర్‌నగర్‌, రాజేశ్‌పురం, నేలకొండపల్లి ప్రాంతాల్లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి ఎంతో ఉపయోగపడే ఈ లైన్‌ సర్వే పనులను కేంద్రం 2013–14 సంవత్సరంలో మంజూరు చేసింది. అయినా ఇంతవరకు ముందుకు సాగడం లేదు. మంత్రులు ఇటీవల కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన నేపథ్యంలో ఆయా పనులకు కేంద్రం నిధులను ఇస్తుందా? లేదా? చూడాల్సి ఉంది.

ఫ డిమాండ్ల దశలోనే కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టులు

ఫ అమలుకు నోచని జిల్లా ఎంపీల ప్రతిపాదనలు

ఫ రైల్వే పనులపై కేంద్ర రైల్వే మంత్రికి ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement