యూరియా కష్టాలు తీర్చేందుకే కొత్త యాప్
రామగిరి(నల్లగొండ), చిట్యాల : వ్యవసాయ సీజన్లలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టిందని, రైతులు నేరుగా యూరియాను బుకింగ్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ (ఏఏడీ) నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ పట్టణంలో గ్రోమోర్ సెంటర్, వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపుతోపాటు చిట్యాల పట్టణంలో గ్రోమోర్ సెంటర్, పీఏసీఎస్‌లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడిన ఆయన యాప్ పనితీరు గురించి తెలుసుకోగా ఓటీపీ విషయంలో సమస్యలు ఉన్నట్లు కౌలు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఏఓ శ్రవణ్‌కుమార్, నకిరేకల్ ఏడీఏ జానీమియా, ఏఓలు, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు ఉన్నారు.
యూరియా కష్టాలు తీర్చేందుకే కొత్త యాప్


