మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నల్లగొండ : నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజలకు బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు తెలిపిన
డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్..
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు డీసీసీ అద్యక్షుడు పున్న కై లాష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
నూతన సంవత్సరం సుఖసంతోషాలు నింపాలి
ఫ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందించాలని ఆకాంక్షించారు.
బుద్ధవనం సందర్శించిన వియత్నాం బౌద్ధ భిక్షువులు
నాగార్జునసాగర్: వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువులు బుధవారం సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ముందుగా నాగార్జునకొండ మహాస్థూపం, మ్యూజియంలో శిల్పాలను తిలకించారు. మహాస్థూపం సమావేశ మందిరంలో లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం సందర్శన తమకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. వీరి వెంట బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఉన్నారు.
మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు


