కొత్త పంచాయతీల్లో నూతన అకౌంట్లు
నల్లగొండ : రెండేళ్ల కాలం ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు పాత పంచాయతీల్లోనూ కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే కొత్త పంచాయతీల్లో కొత్తగా అకౌంట్లు తెరవడంతో పాటు పాత పంచాయతీల్లో కూడా అకౌంట్ల పేర్లు మార్పు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ జారీచేశాం. దీంతో కొత్త పంచాయతీల్లో నూతనంగా అకౌంట్లు తెరవడం, పాతవాటిల్లో పేర్లు మార్పు చేసే కార్యక్రమంలో అధికార యంత్రంగం నిమగ్నమైంది.
25 పంచాయతీల్లో కొత్తగా అకౌంట్లు..
జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే కొత్తగా మరో 25 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇటీవల మూడు పంచాయతీలు మినహా 866 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 25 కొత్త పంచాయతీల్లో కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తోపాటు గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.
ఫ పాత పంచాయతీల్లోనూ
అకౌంట్ల పేర్లు మార్పు
ఫ ప్రత్యేకాధికారులు ఇచ్చిన
చెక్కులు పాస్ చేయొద్దు
ఫ బిల్లుల చెల్లింపు సర్పంచ్,
ఉప సర్పంచ్‌ల సంతకంతోనే జరగాలి
ఫ ఉత్తర్వులు జారీచేసిన
పంచాయతీరాజ్ కమిషనర్
కొత్త పంచాయతీల్లో నూతన అకౌంట్లు


