రాజీవ్‌గాంధీ పాలనలో సాంకేతిక విప్లవం | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌గాంధీ పాలనలో సాంకేతిక విప్లవం

Mar 10 2025 10:20 AM | Updated on Mar 10 2025 10:21 AM

రామన్నపేట : మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ పాలనలోనే దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేటలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాందీ విగ్రహాన్ని ఆదివారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. రాజీవ్‌గాంధీ సాహసోపేతమైన నిర్ణయం వల్ల యువత విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. రాజీవ్‌గాందీ ఆశయసాధనకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, విగ్రహదాత వనం హర్షినీచంద్రశేఖర్‌ పట్టణకాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ జమీరొద్దిన్‌ నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి, జినుకల ప్రభాకర్‌, గాదె శోభారాణి, గంగుల క్రిష్ణారెడ్డి, రవిచంద్ర, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement