ఆహారం కల్తీకి చెక్‌! | - | Sakshi
Sakshi News home page

ఆహారం కల్తీకి చెక్‌!

Mar 10 2025 10:20 AM | Updated on Mar 10 2025 10:19 AM

కల్తీలేని ఆహారం అందించాలి

ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందించేందుకు ఫుడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ వాహనం ఎంతో ఉపయోగపడనుంది. వ్యాపారులు నాణ్య మైన, కల్తీలేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలి.

– జ్యోతిర్మయి,

ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌

నల్లగొండ టూటౌన్‌ : దేశంలో సాంకేతిక విప్లవం ఎంత వేగంగా పెరిగిపోతుందో అంతే వేగంగా అన్నింటా కల్తీ కూడా పెరుగుతోంది. ఏ ఆహార పదార్థం అయిన కల్తీ లేనివి దొరకడం గగనమైంది. ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టాంది. అందులో భాగంగా కల్తీ ఆహార పదార్థాలను ఇట్టే కనిపెట్టేందుకు రూ.60 లక్షల విలువ చేసే ఫుడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ వాహనాన్ని ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసింది. దీని ద్వారా కల్తీని వెంటనే నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఈ వాహనంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఇక నుంచి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి నాణ్యతను పరీక్షించిన అనంతరం నివేదికను కలెక్టర్‌కు పంపనున్నారు. కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఫుడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

వాహనం ప్రత్యేకతలు..

● ఫుడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ వాహనంలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా ఆహార పదార్థాలను పరీక్షించడంతో వెంటనే వాటి నాణ్యత తెలిసిపోతుంది.

● పెద్ద, పెద్ద హోటళ్లతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగే జాతరలు, పండుగలు, ఉర్సుల్లో ఆహార పదార్థాలను వెంటనే పరీక్షించే వెసులుబాటు ఉంటుంది.

● ఆహార పదార్థాల్లో ఫుడ్‌ పాయిజన్‌ అయినా, ఇతర ఏ విధమైన కల్తీ జరిగినా అక్కడ ఉన్న అన్ని ఆహార పదార్థాలను వినియోగించకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

● హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, స్వీట్‌ హౌజ్‌లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తోపుడు బండ్ల మీద పెట్టి వ్యాపారం చేసే వారి వద్ద కూడా తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవచ్చు.

● పాలు, పెరుగు, కూరల్లో వినియోగించే మసాల దినుసులు, కూరగాయలు, అయిల్‌ తదితర వాటిని పరీక్షించి అక్కడే ఫలితాన్ని చూపిస్తారు.

గురుకులాలు, హాస్టళ్లలోనూ తనిఖీలు..

ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం ఫుడ్‌ పాయిజన్‌ అయి పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్‌ పడనుంది. గురుకులాలు, కాలేజీలు, మోడల్స్‌ స్కూల్స్‌, ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనాన్ని ఈ ఫుడ్‌ మొబైల్‌ ల్యాబ్‌ వాహనంతో వెళ్లి సంబంధిత అధికారులు నాణ్యతపై పరీక్షలు జరిపే అవకాశం ఉంటుంది. ఈ వాహనాన్ని ప్రారంభించిన రోజే నల్లగొండ పట్టణంలోని పద్మనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కల్తీపై ఆరా తీశారు.

ఫ ఉమ్మడి జిల్లాకు ఫుడ్‌ మొబైల్‌

ల్యాబ్‌ వాహనం

ఫ వెంటనే నాణ్యత పరీక్ష చేసేలా చర్యలు

ఫ కల్తీలేని ఆహార పదార్థాలు

అందించడమే లక్ష్యం

ఆహారం కల్తీకి చెక్‌!1
1/1

ఆహారం కల్తీకి చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement