చిట్యాల: ప్రజలు జనరిక్ మందులు వినియోగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్‌లో లభించే ఇతర మందులతో పోల్చితే జనరిక్ మందుల ధరలు యాబై నుంచి ఎనబై శాతం వరకు తక్కువ ధరలో లభ్యమవుతాయని, రోగ నివారణలో సైతం మెరుగైన స్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. జనరిక్ మందులపై అపోహలు తొలగించుకోవాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. అనంతరం డీటీసీఓ డాక్టర్ కల్యాణ చక్రవర్తి జనరిక్ మందుల వినియోగంపై ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ రవి, చిట్యాల పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ వెంకటేశ్వర్లు, సత్య నరేష్, సీహెచ్‌ఓ నర్సింగరావు, సూపర్‌వైజర్ వెంకటరమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్


