మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు | Sakshi
Sakshi News home page

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు

Published Tue, Apr 16 2024 2:00 AM

- - Sakshi

నల్లగొండ క్రైం : మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే అందుకు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ప్రతి రోజు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని లైసెన్స్‌ లేకుండా వాహనాలకు తగిన ఆధారాలు లేకుండా నడిపితే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ర్యాష్‌, త్రిబుల్‌, సెల్‌పోన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి వాటిని నిరోధించేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇరు కుటుంబాల్లో విషాదంతో పాటు ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కుంగిపోతాయని పేర్కొన్నారు. గారాభం కోసం మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే వారి తల్లిదండ్రులే కారణమవుతారని పేర్కొన్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి

ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ చందనా దీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు వేసేందుకు వచ్చే క్రమంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్‌ఓ కార్యాలయానికి గరిష్టంగా 3 వాహనాలు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లడానికి ముందుగానే నామినేషన్‌ పత్రాలు పూరించుకోవాలని సూచించారు. అభ్యర్థి తన వాహనాలకు ఆర్‌ఓ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి అనుమతి తీసుకుని మరో అభ్యర్థి ఆ వాహనాన్ని ఉపయోగించొద్దని.. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫ ఎస్పీ చందనాదీప్తి

Advertisement
 
Advertisement