ఫలించని సీపీఆర్‌.. శబరిమలలో సూర్యాపేట వాసి మృతి! | - | Sakshi
Sakshi News home page

ఫలించని సీపీఆర్‌.. శబరిమలలో సూర్యాపేట వాసి మృతి!

Jan 9 2024 5:50 AM | Updated on Jan 9 2024 10:49 AM

- - Sakshi

లింగయ్య (ఫైల్‌)

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట): శబరిమలకు వెళ్లిన ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని తుమ్మలపెన్‌పహాడ్‌ వాసి గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన ఉయ్యాల లింగయ్య(37) సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డు సమీపంలో వాటర్‌ప్లాంట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

గత పదేళ్లుగా అయ్యప్ప మాల వేస్తున్న లింగయ్య ఈ ఏడాది కూడా మాల ధరించాడు. ఆదివారం సూర్యాపేట నుంచి 9మంది మాలధారులు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగి కాలినడకన పంబాకు బయల్దేరగా లింగయ్య రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ మృతిచెందాడు. మృతుడికి భార్య ఉపేంద్రతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement