మిర్యాలగూడ: మిర్యాలగూడ, దామరచర్లలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ అండర్ –19 రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ఆదివారం ముగిశాయి. మిర్యాలగూడలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న ఎస్టీ గురుకులంలో ముగింపు కార్యక్రమానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.నర్సింహారెడ్డి హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతకాలు అందజేసి మాట్లాడారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18న వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగం జిల్లా కార్యదర్శి కె.ఇందిరా, పరిశీలకుడు సతీష్, మాజీ కార్యదర్శి కె.నర్సిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు యుగేంధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నాగార్జున్, ప్రేమ్, చందు, శాంతి, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


