సభలు, సమావేశాలు.. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు
దద్దరిల్లుతున్న ఎన్నికల ప్రచారం
ఫ నేడు నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరులో రేవంత్ సభలు
ఫ రేపు హుజూర్‌నగర్‌కు జేపీ నడ్డా, మునుగోడుకు అమిత్‌షా
ఫ 26న భువనగిరికి అమిత్‌షా
సీపీఎం నేత సీతారాం ఏచూరి
ఫ 27న దేవరకొండ, మునుగోడు,
భువనగిరిలో ప్రియాంక పర్యటన
ఫ ముగిసిన కేసీఆర్ సభలు.. రోడ్ షోలు నిర్వహిస్తున్న కేటీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వివిధ పార్టీల అభ్యర్థుల తరఫున అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 28వ తేదీన సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ఈ ఐదు రోజులు ప్రచారం హోరెత్తనుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా అగ్ర నాయకత్వాన్ని రంగంలోకి దింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సభల్లో వివరించారు. ప్రజలు ఆలోచించాలని, మళ్లీ బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేయగల అంశాలను ప్రస్తావించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల పాల్గొన్న ఆయన గురువారం హుజూర్‌నగర్, దేవరకొండలో రోడ్‌షోల్లో ప్రసంగించారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. 26వ తేదీన మంత్రి హరీష్‌రావు ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలో పాల్గొనేలా బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.
జేపీ నడ్డా, అమిత్‌షా రాక
బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 25వ తేదీన హుజూర్‌నగర్ సభలో పాల్గొంటారు. ఇటీవలే నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. 25వ తేదీన మునుగోడులో, 26న భువనగిరిలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లోనూ విస్తృతంగా పర్యటించేలా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేటలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం నల్లగొండ నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొన్నారు. గురువారం ఆలేరులో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు. 24వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27వ తేదీన దేవరకొండ, మునుగోడు, భువనగిరిలో ప్రియాంక గాంధీ సభలు నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
మాయావతి, పవన్ కళ్యాణ్, సీతారాం ఏచూరి
బీజేపీ, బీఎస్పీ, సీపీఎం అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల జాతీయ నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 22న సూర్యాపేట సభలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పాల్గొని ప్రసంగించారు. గురువారం బీజేపీ అభ్యర్థుల తరపున జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పర్యటించారు. 26వ తేదీన భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, పోచంపల్లి, వలిగొండలో నిర్వహించే రోడ్‌షోలలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొననున్నారు.
అమిత్‌షా
జె.పి. నడ్డా
సీతారాం ఏచూరి
రేవంత్ రెడ్డి
ప్రియాంకగాంధీ






Comments
Please login to add a commentAdd a comment