సివిల్‌ ఎస్‌ఐగా ప్రియాంక | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ ఎస్‌ఐగా ప్రియాంక

Aug 8 2023 2:32 AM | Updated on Aug 8 2023 10:00 AM

ప్రియాంక - Sakshi

ప్రియాంక

నల్గొండ: చిలుకూరు మండలం పరిధిలోని జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన పందిరి అమృతరెడ్డి లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరి రెండో కుమార్తె ప్రియాంక ఎంటెక్‌ పూర్తి చేసింది. ఈమె సోదరి తేజస్విని జైలు వార్డెన్‌గా పనిచేస్తుండగా తమ్ముడు శ్రీకాంత్‌రెడ్డి సివిల్‌ ఇంజనీర్‌ పూర్తి చేశాడు.

ప్రియాంక పదో తరగతి వరకు జెర్రిపోతులగూడెంలో, ఇంటర్‌, ఇంజనీరింగ్‌ కోదాడలో, ఎంటెక్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటోంది.. ప్రియాంక. ఆమెను ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement