మధ్యే మార్గంపై ఆలోచనలు
మిర్యాలగూడలో కాంగ్రెస్ మండల, పట్టణ కార్యవర్గాలు పెండింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం దాదాపు పూర్తి దశకు చేరుకున్నా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇంకా కొలిక్కి రాలేదు. అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేసిన పార్టీ నాయకత్వం మిర్యాలగూడ విషయంలో మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. స్థానిక ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కమిటీలు ప్రకటించడంతో అక్కడి నాయకులు సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండగా, మిర్యాలగూడలో మాత్రం నియామకాలు ఆలస్యం కావడంతో పార్టీ కార్యకలాపాలు కూడా కొంత మందగించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలను పూర్తి చేశారు. కానీ, జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవాల్సిన నేతల జాబితా సిద్ధం చేయలేదు.
మిర్యాలగూడలో ఎందుకీ జాప్యం..?
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లకా్‌ష్మ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో పాటు ఇతర ముఖ్య నాయకుల మధ్య కమిటీల కూర్పుపై పూర్తిస్థాయి అవగాహన కుదరలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పదవుల కేటాయింపు, సామాజిక సమీకరణలు వంటి అంశాల్లో భిన్నాభిప్రాయాలు రావడంతో తుది జాబితా సిద్ధం కావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్ని మండలాల అధ్యక్ష పదవులు తన అనుచరులకే ఇవ్వాలని పట్టుపడతుండగా, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తన వర్గం వారికి కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ వేర్వేరుగా కమిటీల జాబితాలు ఇచ్చారు. ఆ జాబితాలను డీసీసీ అధ్యక్షుడు.. టీపీసీసీకి పంపారు.
మార్కెట్ కమిటీ కూడా వాయిదానే..
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం కూడా ఇప్పటికీ ఖరారు కాలేదు. పాలకవర్గం రిజర్వేషన్‌ను ప్రకటించిన వెంటనే నియమిస్తే ఇప్పటికే ఒకసారి పదవీకాలం కూడా పూర్తయ్యేది. నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పదవి కావడంతో ఒకరికి అవకాశం కల్పిస్తే మరొకరు పార్టీకి దూరమవుతారేమోననే ఆలోచనతో నియామకంలో జాప్యం చేస్తున్నారని, ఈ ఆలోచన ప్రక్రియతో ఆశావహులు గందరగోళంలో పడ్డారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో కమిటీల కూర్పు విషయంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేత మధ్యే మార్గాన్ని టీపీసీసీకి ప్రతిపాదించినట్లు తెలిసింది. ముఖ్యంగా నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీలోకి తీసుకునే 10 – 15 మంది నాయకుల్లో 20 శాతం (ఇద్దరి నుంచి ముగ్గురిని) ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అనుచరులను, 10 శాతం (ఒకరు లేదా ఇద్దరిని) ఎంపీ అనుచరులను, 70 శాతం (ఏడుగురు నుంచి పది మందికి పైగా) ఎమ్మెల్యే అనుచరులకు స్థానం కల్పించేలా ప్రతిపాదించారు. మిర్యాలగూడ పట్టణంతోపాటు, ఒక మండలం అధ్యక్ష స్థానాన్ని ఎమ్మెల్సీ అనుచరులకు ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఫ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్య నేతల మధ్య కుదరని సయోద్య
ఫ వేర్వేరుగా జాబితాలను ఇచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ఫ ఇద్దరి జాబితాలను టీపీసీసీకి పంపించిన డీసీసీ అధ్యక్షుడు


