విద్యార్థులకు యూనిఫాం అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు యూనిఫాం అందజేయాలి

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

నల్లగొండ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విద్యార్థులకు యూనిఫాం అందించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. యూనిఫామ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని ఆదేశించారు. రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులపై రైతులు, ప్రజలు, జిల్లా అధికారులు ప్రజలకు తెలిసే విధంగా సమాచారం అందించాలని సీపీఓ శ్రీనివాస్‌నాయక్‌ను ఆదేశించారు. 45 రోజులకోసారి సర్పంచ్‌లతో మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శంకరనాయక్‌కు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమకరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు పాల్గొన్నారు.

ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ టౌన్‌: జాతీయ ఎస్సీ–ఎస్టీ హబ్‌ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్విని యోగం చేసుకోవాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మనో రమ హోటల్‌లో కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వ్యవస్థాపక అవగాహన – ప్రత్యేక విక్రేత అభివృద్ధి’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్య సాధనలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ హైదరాబాద్‌ హెడ్‌ ఎస్‌.సురేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా జాతీయ ఎస్సీ–ఎస్టీ హబ్‌తో భాగస్వామ్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ జనరల్‌ మేనేజర్‌ జి.సతీష్‌కుమార్‌, కె.బి.వెంకట్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌ బస్సులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌

రామగిరి (నల్లగొండ) : నల్లగొండ నుంచి హైదరాబాద్‌ (దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌) మార్గంలో ఎలక్ట్రిక్‌ డీలక్స్‌ బస్సుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. www.ts.srtcbus.in వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్‌ఆర్టీసీ యాప్‌ ద్వారా.. ప్రయాణ తేదీ, నచ్చిన సీటును సెలెక్ట్‌ చేసుకుని, వివరాలు నమోదు చేసి.. నిర్ణీత రుసుం చెల్లించి టికెట్‌ కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యానికి భవిష్యత్‌లో మరిన్ని సర్వీసులకు విస్తరిస్తామని డిపో మేనేజర్‌ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement