బావను హత్య చేసిన బావమరిది | - | Sakshi
Sakshi News home page

బావను హత్య చేసిన బావమరిది

Jun 4 2023 10:10 AM | Updated on Jun 4 2023 10:09 AM

- - Sakshi

 నల్గొండ​​​​​​ : బావమరిది చేతిలో బావ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన మిడసనమెట్ల సాయన్న తన కూతురు పారిజాతను నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మారడుగుల గ్రామానికి చెందిన అంజనేయులుకి (35)ఇచ్చి వివాహం చేశాడు.

వివాహ సమయంలో తనకున్న రెండు ఎకరాల్లో కూతురికి ఎకరం భూమి ఇచ్చాడు. అంజనేయులు తన భార్య పారిజాతతో కలిసి హైదరాబాద్‌లో పేయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, కొడుకు వెంకటయ్య మద్యం తాగి వ్యసనాలకు అలవాటు పడుతున్నాడని ఉన్న ఇంకో ఎకరం భూమి సాయన్న తన పేరిటే ఉంచుకున్నా డు. ట్రాక్టర్‌ నడుపుకుంటూ పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద ఉంటున్న సాయ న్న కుమారుడు వెంకటయ్య తన చెల్లెలికి భూమి ఇవ్వడం ఇష్టంలేక బావపై కక్ష పెంచుకున్నాడు.

నాలుగు రోజుల క్రితం పిలిపించుకుని..
వెంకటయ్య నాలుగు రోజుల క్రితం అంజనేయులును అంగడిపేటకు రప్పించుకున్నాడు. పూటుగా మద్యం తాపించి శుక్రవారం సుత్తెతో మోది అంజనేయులును హత్య చేశాడు. అనంతరం అంజనేయుల మృతదేహాన్ని బస్తాలో కట్టి శుక్రవారం రాత్రి అంగడిపేట సమీపంలోని ఏఎమ్మార్పీ కాలువ పక్కన వేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. అంజనేయులు భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.

సుత్తెతో తలపై మోది ఘాతుకం

భూమి ఇవ్వడం ఇష్టం లేకనే దారుణం

పెద్దఅడిశర్లపల్లి మండలం

అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement