కొల్లాపూర్(కొల్లాపూర్ రూరల్): మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయశాఖ డివిజన్ పర్యవేక్షకులు మధన్‌కుమార్ ఆధ్వర్యంలో టెంకాయల విక్రయ వేలం నిర్వహించారు. 2027 సంవత్సరానికి గాను చిన్నచింతకుంటకు చెందిన కార్తీక్ రూ.36.39 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే కొబ్బరిచిప్పల సేకరణకు సంబంధించి సూర్యాపేటకు చెందిన సురేశ్ రూ. 31.06 లక్షలకు వేలం పాడినట్లు ఈఓ జయపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిత్య లక్ష్మణ్‌రావు, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉపసర్పంచ్ సాయికృష్ణగౌడ్, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


