43,653 మంది పట్టభద్రుల నమోదు | - | Sakshi
Sakshi News home page

43,653 మంది పట్టభద్రుల నమోదు

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

నాగర్‌కర్నూల్‌/కందనూలు: పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాల రూపకల్పన పారదర్శకంగా, పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 43,653 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. వీరిలో 43,598 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించగా.. మరో 55 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పరిశీలించి, పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 25న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి, తదుపరి ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం డిసెంబర్‌ 30న తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పట్టభద్రుల నమోదుకు ఫారం–18, ఉపాధ్యాయుల నమోదుకు ఫారం–19 ద్వారా అందిన దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. విద్యార్హతలు, సాధారణ నివాసం, ఉపాధ్యాయుల బోధనా సేవలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించి, అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ నిర్వహించిన వీసీలో అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య, కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, ఎన్నికల విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్‌ కల్పన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement