ఆపత్కాలంలో బీధీమా! | - | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో బీధీమా!

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

పకడ్బందీగా అమలు : కలెక్టర్‌ అమలు ఇలా..

ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దరఖాస్తుల స్వీకరణకు 460 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 85 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నమోదు ప్రక్రియ పర్యవేక్షణకు అదనపు కలెక్టర్‌ దేవసహాయంను జిల్లా నోడల్‌ అధికారిగా నియమించగా.. 188 మంది సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 59 చెంచు పెంటల్లోని కుటుంబాలనూ పథకంలో చేర్చాలని కలెక్టర్‌ ఆదేశించారు.ప్రతి గ్రామపంచాయతీలో రోజుకు 50 మందికి టోకెన్లు ఇచ్చి నమోదు చేపట్టాలని.. శిబిరాల్లో హెల్ప్‌డెస్క్‌లు, అవసరమైన సాంకేతిక పరికరాలు, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. డప్పు చాటింపు, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని.. వివరాలు అందుబాటులో లేవనే కారణంతో ఏ ఒక్క అర్హుడిని వెనక్కి పంపించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా, డీఆర్వో పాండు ఉన్నారు.

బీమా క్లెయిమ్‌లకు సంబంధించి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, సీపీఓ/డీఆర్డీవో, కలెక్టర్‌/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆమోదం ద్వారా బీమా కంపెనీకి ఫార్వర్డ్‌ చేయబడుతుంది. మున్సిపల్‌ స్థాయిలో వార్డు ఆఫీసర్‌ దరఖాస్తులను స్వీకరించనుండగా.. కమిషనర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌తో పాటు సీపీఓ/మెప్మా పీడీ పరిశీలించి, కలెక్టర్‌/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత క్లెయిమ్‌ ఫాం బీమా కంపెనీకి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువగా సంపాదించే వారు ఉంటే ఎవరి పేరిట బీమా పొందాలనుకుంటున్నార, వారి నామినీలను నిర్ణయించుకునే వెసులుబాటు దరఖాస్తుదారులకు కల్పించనున్నారు.

జిల్లాలో 2.56లక్షల కుటుంబాలకు ప్రయోజనం

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

460 జీపీలు, 85 మున్సిపల్‌

వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement