అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

తెలకపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలకపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు చేయూత పింఛన్‌ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం.. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మండలంలో మొదటి విడతగా 690 మందికి చేయూత పింఛన్‌ మంజూరైందని.. ఇంకా ఎవరికై నా రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని, రెండో విడత మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, సర్పంచ్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, భాస్కర్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement