కల్వకుర్తి రూరల్: పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాస్థాయి అండర్–14 వాలీబాల్ పోటీల్లో కల్వకుర్తి జట్టు విజేతగా నిలిచింది. అండర్–14, 19 విభాగాల్లో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అండర్–14 విభాగానికి ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో కల్వకుర్తి, బిజ్జారం జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన పోరులో కల్వకుర్తి జట్టు విజయం సాధించగా.. బిజ్జారం జట్టు రెండో స్థానంలో నిలిచింది. సోమవారం క్రీడల ముగింపు కార్యక్రమం ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 16 పాఠశాలలు, 10 కళాశాలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.


