ఉన్నత విద్య అందని ద్రాక్షేనా..? | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య అందని ద్రాక్షేనా..?

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

న్యూస్‌రీల్‌

ఖేలో ఇండియా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయి శివాని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఇండోర్‌ స్డేడియంలో ద్వారం, ఇతర పనులను ఆమె పరిశీలించారు. 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నివేదిక పంపించాం..

జిల్లాకేంద్రంలో అంబేడ్కర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సుల కోసం అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. త్వరలోనే పీజీ కోర్సులకు అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. – అంజయ్య,

ఓయూ కోఆర్డినేటర్‌, నాగర్‌కర్నూల్‌

హైదరాబాద్‌కు వెళ్లలేక..

పీజీ చదువు కోసం హైదరాబాద్‌ వెళ్లి చదువుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఎంతో మంది మధ్య తరగతి విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జిల్లాకేంద్రంలో ఓపెన్‌ పీజీ కోర్సు ఏర్పాటు చేయాలి.

– బంగారుబాబు, ఏబీవీపీ నాయకుడు

ప్రాక్టికల్స్‌ సెంటర్‌ లేక..

నేను అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌ నాగర్‌కర్నూల్‌లో బీఎ స్సీ పూర్తి చేశాను. ప్రతి ఏ డాది ప్రాక్టికల్స్‌ కోసం వనపర్తి వెళ్లి పరీక్ష రాసి వచ్చేవాళ్లం. జిల్లాకేంద్రంలోని స్టడీ సెంటర్‌లో ప్రాక్టికల్స్‌కు సెంటర్‌ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. స్టడీ సెంటర్‌లో ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. – రవి, డిగ్రీ విద్యార్థి

కందనూలు: జిల్లాకేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నా పీజీ కోర్సులు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా సుమారు 2 వేల మంది విద్యార్థులు రెగ్యులర్‌ డిగ్రీ, ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేసి పీజీ తదితర కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారిలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ చదువుకోవాలనుకునే వారికి ఓపెన్‌ యూనివర్సిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జిల్లాకేంద్రంలోనే అధ్యయన కేంద్రంలో పీజీ కోర్సులు అందుబాటులో లేనందున హైదరాబాద్‌ తదితర నగర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు, వసతి, భోజనం, ఇతర అవసరాల కోసం అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.

గ్రామీణ విద్యార్థులపై ఆర్థిక భారం..

నల్లమలలోని అమ్రాబాద్‌, పదర, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాంతాలకు చెందిన గ్రామీణ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేకపోతున్నారు. కొందరు అప్పులు చేసి చదువుకుంటుండగా.. మరికొందరు ఖర్చులు భరించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి దాపురించింది. స్థానికంగా కళాశాలలో పీజీ కోర్సు అందుబాటులో ఉండటం వలన విద్యార్థులకు ప్రయాణ భారం తగ్గడమే కాకుండా తక్కువ ఖర్చుతో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది.

జిల్లాకేంద్రంగా ఏర్పడినా..

కందనూలు జిల్లాకేంద్రంగా ఏర్పడి పదేళ్లు గడిచినా ఇప్పటివరకు ఓపెన్‌ పీజీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎక్కువ శాతం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఓపెన్‌ పీజీ ఎందుకు ఉండకూడదని ప్రశ్న పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావంతుల నుంచి వినిపిస్తోంది. ఒక విద్యార్థి డిగ్రీ వరకు చేరుకొని ఆ తర్వాత ఆర్థిక కారణాలతో రెగ్యులర్‌ పీజీ చదవలేకపోతే దూర విద్య ద్వారా పీజీ చేసుకునే అవకాశం కల్పిస్తే ఆ విద్యార్థి కొంత మేరకు ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకేంద్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఓపెన్‌ పీజీ కళాశాల అందుబాటులో లేకుండా ఉండటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు కృషిచేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

జిల్లాలో ఓపెన్‌ పీజీ లేక విద్యార్థుల అవస్థలు

ఉన్నత చదువుల కోసం

సుదూర ప్రాంతాలకు..

ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న పేదలు

కందనూలులో ఓపెన్‌ పీజీ కోర్సు ఏర్పాటు చేయాలని వేడుకోలు

పీజీ కోర్సు ప్రవేశపెట్టాలి..

సైన్స్‌ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌లో డిగ్రీ వరకు మాత్రమే కోర్సులు ఉన్నాయి. పీజీ కోర్సులు లేకపోవడంతో మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చొరవ తీసుకొని పీజీ కోర్సులు ఏర్పాటుకు కృషిచేయాలి.

– సంధ్య, డిగ్రీ విద్యార్థిని

ఓపెన్‌ డిగ్రీ వరకు..

జిల్లాకేంద్రంలోని సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ డిగ్రీ వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అందులో డిగ్రీలో సైన్స్‌ ప్రాక్టికల్స్‌ కోసం మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేయాలనుకొనే వారు జిల్లాకేంద్రంలో పీజీ అవకాశాలు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు డిగ్రీతోనే చదువును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, రెగ్యులర్‌ పీజీ కళాశాలలో చేరేందుకు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి, ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఓపెన్‌ డిగ్రీ ద్వారా చదువు కొనసాగించిన పేద, మధ్య తరగతి విద్యార్థులచే పీజీ చేయడానికి ఆర్థిక భారం అడ్డంకిగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement