మెడికల్‌ షాపుల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపుల్లో తనిఖీలు

Nov 20 2026 2:00 AM | Updated on Nov 20 2026 2:00 AM

కందనూలు: జిల్లాలోని పలు మెడికల్‌ షాపుల్లో గురువారం డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వంత్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మందుల విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అనే అంశాలను పరిశీలించారు. షాపుల్లో విక్రయిస్తున్న ఔషధాల నిల్వలు, గడువు తేదీలు, కొనుగోలు బిల్లులు, లైసెన్స్‌లు, రికార్డులను తనిఖీ చేశారు. వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే యాంటీ బయాటిక్స్‌, ఇతర నియంత్రిక ఔషధాల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

వ్యాధుల నివారణకు కృషి చేయాలి : డీఎంహెచ్‌ఓ

కందనూలు: జిల్లాలో వ్యాధుల నివారణకు కమ్యూనిటీ హెల్త్‌ వలంటీర్లు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ సూచించారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వలంటీర్లకు రేబిస్‌, బర్డ్‌ప్లూ, ఏబీఎన్‌ ఇన్ఫుయింజా, జూనోటిక్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ, పశుసంవర్ధక, అటవీశాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో వ్యాధుల నివారణకు వలంటీర్లు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

లాభదాయక పంటలపై దృష్టి సారించాలి

కొల్లాపూర్‌ రూరల్‌: రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించి.. యాసంగిలో వరికి బదులుగా చిరుధాన్యాలు, నూనె గింజల పంటలతో పాటు కూరగాయలు పండించాలని కొల్లాపూర్‌ ఉద్యానశాఖ అధికారి లక్ష్మణ్‌ సూచించారు. గురువారం మండలంలోని నార్లాపూర్‌ రైతువేదికలో రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి తోటల్లో తేమ మంచు ప్రభావం, అక్కడక్కడ పూత కనిపిస్తుందని తెలిపారు. నవంబర్‌ చివరి, డిసెంబర్‌ మొదటి వారంలో మామిడి తోటలకు నీటి తడులు ఇవ్వాలని ఆయన సూచించారు. పిందెలు ఏర్పడగానే చెట్టు వయసు మేరకు సిఫారసు చేసిన ఎరువులు వినియోగించాలన్నారు. కూరగాయలు సాగుచేసే రైతులకు మల్చింగ్‌, పందిళ్లను సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామన్‌గౌడ్‌, ఏఈఓ అంబిక, హెచ్‌ఈఓ కొండలు, చంద్రశేఖర్‌, అజయ్‌ పాల్గొన్నారు.

ఉత్సాహంగా

బ్యాడ్మింటన్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో గురువారం అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.రవికుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

● విచారణ చేపట్టిన మండల విద్యాధికారి

వివరాలు 8లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement