కల్వకుర్తి రూరల్: పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. గురువారం కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని.. వారు ఇచ్చే ప్రతి ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలన్నారు. డయల్ 112కు వచ్చే కాల్స్‌కు సత్వరం స్పందించి.. బాధితులకు సకాలంలో సహాయం అందించాలని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అలాగే ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ సాయి వెంకట్‌రెడ్డి, సీఐ భీంకుమార్, ఎస్‌ఐలు రమాదేవి, కురుమూర్తి ఉన్నారు.


