కందనూలు: ఖేలో ఇండియా యూత్ గ్రేమ్స్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో మస్కట్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ పట్టణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులు, ప్రజలకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే సెల్ఫీ పాయింట్లు, మాల్స్, పార్కులు, బస్ స్టేషన్లు ప్రధాన కూడళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో కటౌట్లు, స్టాండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, డీఈఓ రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.


