చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువా రం ఉదయం ముందుగా అర్చకులు ఆలయా న్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులకు స్వామివారం దర్శనం కల్పించారు. భక్తులు మెట్లపై కొబ్బరికాయలు కొట్టి గోవింద నామస్మరణ చేస్తూ స్వామి చెంతకు చేరి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు నైవేద్యం పెట్టి.. తలనీలాలు సమర్పించి వేడుకున్నారు. అలాగే అలివేలు మంగమ్మ, ఉద్దాల మండపం, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణా ల్లో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ బాలరాజు, ఈఓ మధనేశ్వరెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు.


