అచ్చంపేట: వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి.. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రాన్ని సకల సదుపాయాలతో ముస్తాబు చేసేందుకు తలపెట్టిన నాగర్‌కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) ఏర్పాటు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం 2024 అక్టోబర్ 25న జిల్లాలోని అమ్రాబాద్, పదర మినహా 18 మండలాల పరిధిలోని 319 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలను కలుపుతూ నుడా ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేక ఆర్థిక మండలిని నియమిస్తూ.. జీవో నం.190 విడుదల చేసింది. అయితే నుడాతో జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఇంత వరకు ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సుందరంగా తీర్చిదిద్దుతా..
నాగర్‌కర్నూల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులకు కొన్ని రోజుల క్రితం ప్రభు త్వం రూ. 40కోట్లు మంజూరు చేసింది. ఇంకా ఎన్ని నిధులు అవసరమైనా ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం. నుడా ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతాం. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని బైపాస్ రహదారి ఏర్పాటుకు కృషి చేస్తాం.
– కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నుడా ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. మున్సిపల్ మ్యా ప్, ప్రణాళికలు గతంలో చేసినవి సిద్ధంగా ఉన్నా యి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా నే అందుకు సంబంధించిన ప్రణాళికలతో నాగర్‌కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏ ర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభు త్వం నుంచి విడుదలైన నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. – నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
జీవో విడుదలతో సరిపెట్టిన ప్రభుత్వం
నాగర్‌కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటులో జాప్యం
గెజిట్ ప్రకటన కాగితాలకే పరిమితం
రెండేళ్లుగా ముందుకు సాగని ప్రక్రియ
ప్రత్యేక నిధుల కోసం తప్పని ఎదురుచూపులు


