మూడు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు..
అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ అందించారు. ఇప్పటికే సీఎం స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ బోర్లు, ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు. అలాగే బల్మూర్ మండలంలోని కొండారెడ్డిపల్లిలోనూ ఇళ్లకు ఉచిత సోలార్ విద్యుత్ అందించే ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుం లేకుండా వందశాతం రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో 114 ఇళ్లు ఉండగా ఇప్పటి వరకు 102 ఇళ్లకు సౌర విద్యుత్ ప్యానెళ్లు అమర్చారు. అలాగే నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో 699 ఇళ్లకు గాను 78 ఇళ్లకు సౌర విద్యుత్ ప్యానెళ్లు బిగించారు. వ్యవసాయానికి సంబంధించి 633 కనెక్షన్లకు గాను 96 పూర్తిచేశారు. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి సౌర విద్యుత్‌కు తెలంగాణ పునరుత్పాదన ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.76 వేల చొప్పున కేటాయించారు.
‘నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా
అందరికీ ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లకు అవసరమైనా ఉచితంగా
అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం
పొందేలా చర్యలు చేపడుతాం. రానున్న వందరోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్
అందించి.. దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తూ..
అదనపు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్ముకునేలా కృసిచేస్తా. ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ
సీఎంకు సూచించా. అసెంబ్లీ ఎన్నికల్లో
మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి
కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తా..’
..... 2025 మే, 19న అమ్రాబాద్
మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ప్రారంభోత్సవ
బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
అన్న మాటలివి.. అయితే ఇందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేరిన దాఖలాలు లేకుండాపోయాయి. ప్రధానంగా నియోజకవర్గంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు పైలెట్ ప్రాజెక్టు కింద ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ
అమలుకు నోచుకోలేదు. దీనికి అప్పట్లోనే ట్రాన్స్‌కో అధికారులు ప్రతిపాదనలు
సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు.
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గంలో 39,066 వ్యవసాయ మోటారు పంపుసెట్లు, 50,488 గృహాలు, 6,037 వాణిజ్య, 368 పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లుగా ట్రాన్స్‌కో అధికారుల లెక్కల్లో తేల్చారు. వాణిజ్య, పరిశ్రమలు మినహా వ్యవసాయ, గృహాలకు సౌర విద్యుత్ కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వం మొదటి విడతగా వ్యవసాయ రంగానికి సౌర విద్యుత్ కల్పించనున్న నేపథ్యంలో ఇందుకు రూ.2,148.63 కోట్లు ఖర్చు కానుంది. ఇందులో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ (ఇన్వర్టర్)కు రూ.976.65 కోట్లు, యూనివర్సల్ సోలార్ పంప్ కంట్రోలర్ (యూఎస్‌పీఎస్) రూ.1,171.98 కోట్లతో ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై సోలార్ ప్యానల్స్, కన్వెర్టర్ కంట్రోలర్ ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలోని బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి, నాగర్‌కర్నూ ల్ మండలంలోని తూడుకుర్తి, వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకుండా వందశాతం సబ్సిడీపై విద్యుత్‌ను అందించేందుకు చర్య లు తీసుకుంటున్నాం. వ్యవసాయ కనెక్షన్లతోపాటు ఇంటింటికి సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మీటర్లను గ్రిడ్‌కు అనుసంధానించి ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి మిగులు విద్యుత్‌ను లెక్కించి వినియోగదారులకు చెల్లి స్తున్నాం. అన్ని గ్రామాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత సౌర విద్యుత్ ఇవ్వాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. – నర్సింహారెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
5 లేదా 7.5 కిలోవాట్ల సామర్థ్యం..
వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు 5 హెచ్‌పీ నుంచి 7 హెచ్‌పీ బోరు మోటార్లు వినియోగిస్తుంటారు. వీటికి 5 లేదా 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఇళ్లకు అయితే 2 నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్‌కు రూ.65 వేల నుంచి రూ.70 వేల ఖర్చు వస్తుండగా రోజుకు 4 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్‌కు కేంద్రం రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. వ్యవసాయానికి 5 కిలోవాట్ల ప్యానల్, కన్వెర్టర్ కంట్రోలర్‌తో కలిపి రూ.3.50 లక్షల ఖర్చు వస్తోంది. వీటి ద్వారా నెలకు 600 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్లకు రూ.2.10 లక్షలు ఖర్చు అవుతుండగా.. రోజుకు 12 యూనిట్ల చొప్పున నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
దేశానికే ఆదర్శంగా
తీర్చిదిద్దుతామన్న సీఎం..
ఏడాదిన్నరైనా నెరవేరని హామీ
సొంత భూముల్లో సౌర విద్యుత్‌పై సన్నగిల్లుతున్న ఆశలు
ఏడాది క్రితమే వ్యవసాయ కనెక్షన్ల వివరాలు సేకరించిన ట్రాన్స్‌కో
నియోజకవర్గంలో 39,066 వ్యవసాయ పంపుసెట్లు
రూ.2,148.63 కోట్లతో ప్రతిపాదనల రూపకల్పన


