బల్మూర్: మండలంలోని కొండనాగుల గ్రామ సమీపంలో గల గుడిబండ గట్టుపై ఉన్న ప్రాచీన శ్రీదుర్గ రుద్రేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గుడిబండ గట్టుపై చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రాచీన ఆలయాల పరిరక్షణ మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమేనని అన్నారు. కొండనాగుల గుడిబండ గట్టు ఆలయాన్ని అన్ని సౌకర్యాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు మార్గం నిర్మించడంతో పాటు గుండాలను అభివృద్ధి చేయాలని, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంప్రసాద్‌గౌడ్, సర్పంచ్ కాట్రాజ్ పద్మ, ఉపసర్పంచ్ నర్సింహ, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీపతిరావు, కాశన్నయాదవ్, మశన్న, జగన్, సైదులు, మైమూ ద్, శ్రీనివాసులు, మోహన్‌రెడ్డి, రామస్వామిగౌడ్, చంద్రమోహన్, జహంగీర్ పాల్గొన్నారు.


