గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ ప్రకారం 57 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి. నాలుగేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాం. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి పింఛన్ మంజూరు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మాకూ పింఛన్ ఇవ్వాలి.
– బాలస్వామి,
తెలుగుపల్లి, అమ్రాబాద్ మండలం
జిల్లాలోని 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ కాపీలు లబ్ధిదారులకు అందజేస్తాం. గ్రామ, వార్డుసభలు ఏర్పాటు చేసి పల్లెల్లో గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపడుతాం.
– చిన్న ఓబులేష్, డీఆర్డీఓ
●


