కొల్లాపూర్: రైతుల అభ్యున్నతే లక్ష్యంగా మార్కెట్ కమిటీలు పనిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా షమీమ్, వైస్‌చైర్మన్‌గా నర్సింహ, సభ్యులుగా జగదీశ్వర్‌నాయుడు, శ్రీనివాసులు, రాందాసు, లక్ష్మయ్య, రామస్వామి, పెద్ద కృష్ణారావు, శ్రీరాములు, రామచంద్రయ్య, మౌనిక, కృష్ణయ్య, చాంద్‌పాష ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పదవులు పొందే వ్యక్తులు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలన్నారు. గత రెండున్నర దశాబ్దాల కాలంలో కొల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, కృష్ణా జలాలతో ఈ ప్రాంతం పచ్చగా మారిందని వివరించారు. రూ.వంద కోట్లతో కొల్లాపూర్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.400 కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. కొందరు నాయకులు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కనబెట్టి అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని పేర్కొన్నారు. విమర్శలకు సమాధానం చెప్పడం కంటే ప్రజలకు మేలు చేసే పనులు చేపట్టేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. అనంతరం చుక్కాయిపల్లి చెరువు కట్టపై రూ.6.5 కోట్లతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, కౌన్సిలర్లు అనూష, సుజాత, జయలక్ష్మి, మహేష్, అన్వర్‌పాషా, శేఖర్, శివయ్య, లహరి, స్వప్న శిల్ప, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


