ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టిసారించాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టిసారించాలి

Oct 29 2026 12:48 AM | Updated on Oct 29 2026 12:48 AM

కొల్లాపూర్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు దృష్టిసారించాలని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్‌రోల్‌మెంట్‌ గతంలో కంటే ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. యువత, నిరుద్యోగులు కాంగ్రెస్‌ విధానాలపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీఆర్‌ఎస్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నరేందర్‌రెడ్డి, జంబులయ్య, సాంబశివుడు, వెంకటస్వామి, సాయిరాం, నిరంజన్‌, రుక్మద్దీన్‌, భాస్కర్‌రావు, శంకర్‌నాయక్‌, కృష్ణమూర్తి, ఖాదర్‌పాష, దశరథం, చంద్రశేఖర్‌, అశోక్‌, గోపాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యాపకులు కోరారు. పీయూలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. వివిధ యూనివర్సిటీల్లో సుమారు 1,200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ వంటి అర్హతలున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకుల నియామక ప్రక్రియలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 30న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి కాంట్రాక్టు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భూమయ్య, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌, సోమేశ్వర్‌, సుదర్శన్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌, రామ్మోహన్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీలత, మృదుల తదితరులు పాల్గొన్నారు.

పత్తి క్వింటా రూ.9,060

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో బుధ వారం పత్తి క్వింటా గరిష్టంగా రూ.9,060, కనిష్టంగా రూ.8,860 ధర పలికింది. అలాగే ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం గరిష్టంగా రూ. 3,301, కనిష్టంగా రూ.2,071, మొక్కజొన్న గరిష్టంగా రూ.3,072, కనిష్టంగా రూ.2,651, ఆముదాలు గరిష్టంగా రూ.7,966, కనిష్టంగా రూ.7,825 ధరలు లభించాయి.

పెరగని హంస ధాన్యం

దేవరకద్ర: సన్నరకం ధాన్యం ఒక్క సారిగా ధరలు పెరిగిపోతుండగా దొడ్డు రకం హంస ధాన్యం ధరలు మాత్రమే పెరగకుండా నిలకడగా ఉన్నాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.3,256, కనిష్టంగా రూ.2,819గా ధరలు పలికాయి. కేఎన్‌ఎమ్‌ రకం ధాన్యం గరిష్టంగా రూ.3,303, కనిష్టంగా రూ.2,869గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2109గా ఒకే ధర నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement