ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Oct 29 2026 12:48 AM | Updated on Oct 29 2026 12:48 AM

కందనూలు: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీసీ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్‌, హైమావతి, జగన్‌, భీముడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement