కందనూలు: బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సర్ ప్రక్రియ తప్పుల తడకగా ఉందని ఓటు బచావో.. దేశ్ బచావో పేరుతో నవంబర్ 1న ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న ట్లు ఏఐసీసీ పరిశీలకులు రవీంద్రదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే వంశీకృష్ణ అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్త కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జిలు సిద్దేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సమావేశం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం విస్తృతస్థాయి సమావేశం ఈనెల 26న మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ‘ఫోరం’ అధ్యక్ష, కార్యదర్శులు రాజసింహుడు, రవీందర్‌రెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ‘ఫోరం’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి సయ్యద్ ఫరీద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
‘నో పెన్షన్ సర్టిఫికెట్’
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ లేనందున ‘నో పెన్షన్ సర్టిఫికెట్’ ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు తెలిపారు. ఈ మేరకు సంస్థ ఎండీ నాగిరెడ్డి ఈనెల 8న జి.సి.1/255 (80) 2026–పీఓ (టీ అండ్ డబ్ల్యూ) ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. అర్హులైన విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత డీఎంను సంప్రది స్తే ఈ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రుణమాఫీ చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని వారి పంట రుణాలను మాఫీ చేయాలని పాలమూరు రెడ్డిసేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. స్థానిక రాజా బహదూర్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఆదివారం పాలమూరు రెడ్డిసేవా సమితి ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.


