ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో సన్నబియ్యమే వండుతున్నారు. సన్న వడ్లను ప్రభుత్వమే సీఎంఆర్ రూపంలో కొనుగోలు చేసి, బియ్యం ఇచ్చే విధంగా రైస్‌మిల్లులతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్‌లో సన్న వడ్ల కొరత ఏర్పడింది. ఇది కూడా బియ్యం ధరల పెంపునకు ఓ కారణంగా భావించవచ్చు. మార్కెట్‌లో సన్న వడ్ల నిల్వలు బాగా తగ్గిపోయాయి. దీంతో కొరత పెరగి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.


