పది నెలల్లో పెరుగుదల ఇలా..
● గతేడాది ఇదే నెలలో రూ 4,500 ధర.. ప్రస్తుతం రూ.7,100కు విక్రయం
● ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజు రూ.15లక్షల వరకు భారం
● ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు
విస్తీర్ణం తగ్గడమే కారణం
పది నెలలుగా సన్నబియ్యం ధరలను పరిశీలిస్తే, ప్రజల గుండె గుభేలుమంటోంది. గతేడాది నవంబర్‌లో కింటా బియ్యం ధర రూ. 4,400 ఉండగా.. ప్రస్తుతం రూ. 6,400 నుంచి రూ. 6,600 వరకు విక్రయిస్తున్నారు. అయితే మార్చి నుంచి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు రూ. 4,600 ఉండగా.. ఏప్రిల్‌లో ఏకంగా క్వింటాకు రూ. 300 పెరిగి, రూ. 4,900కి విక్రయించారు. మే నుంచి జూలై వరకు రూ.200 పెరుగుకుంటూ వచ్చింది. జూలైలో రూ. 5,500 ఉండగా.. ఆగస్టులో చివరి వారంలో రూ. 6,300కు చేరింది. సెప్టెంబర్ నెలాఖరులో రూ. 7వేల వరకు ధర పలికింది. ఈ రేట్లు కేవలం హోల్‌సెల్ వ్యాపారులకు మాత్రమే. వారికి హమాలీ, రవాణా ఖర్చుతో క్వింటాకు మరో రూ. 200 వరకు పెరుగుతుంది. ఈ లెక్కన ప్రజలకు రూ. 7,100 నుంచి రూ.7,300 వరకు బియ్యం విక్రయిస్తున్నారు.


