గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

Sep 25 2026 1:11 AM | Updated on Sep 25 2026 1:11 AM

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సర్పంచుల శిక్షణ అవగాహన సదస్సులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తులు, మౌలిక వసతులు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పథకం ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు అత్యంత అవసరమైన పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టే పనుల విషయంలో సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు పథకం మార్గదర్శకాలు, నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని, ఈ పథకం ద్వారా గ్రామంలో 375 రకాల పనులు చేపట్టేందుకు వీలుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టరాదని, ప్రతి పని నిర్దేశించిన విధివిధానాల ప్రకారమే కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి పనులను ఎంపిక చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, మౌలిక వసతులు, సహజ వనరుల అభివృద్ధి వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని, పనుల వివరాలు, ఖర్చులు, పురోగతి తదితర అంశాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలన్నారు. పథకం అమలుకు సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, పథకం అమలులో ప్రజల భాగస్వామ్యం పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, అదనపు డీఆర్‌డీఓ రాజేశ్వరి, డీఏఓ యశ్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement