పాన్‌గల్: విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని నిజామాబాద్ (మంగళ్లపల్లి) గ్రామస్తులు, రైతులు గురువారం మండలంలోని కేతేపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. తరుచూ విద్యుత్ కోతలతో పంటలకు, గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. బుధవారం రాత్రి నుంచి సరఫరా నిలిచిపోవడంతో చీకటిలో ఇబ్బందులు పడ్డామని, తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామానికి ప్రత్యేక బ్రేకర్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక స్తంభాలు, లైన్ ఏర్పాటు చివరి దశలో ఉందన్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు పూర్తిచేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెప్పడంతో వారు శాంతించారు.


