రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్–2026 క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. మొదటి దశ హియరింగ్ ముగిసింది. రెండో దశ 12, 13 తేదీల్లో ఎస్‌ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్ జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్వహిస్తున్నాం. ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఓటర్లు, దరఖాస్తుదారులు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం–6, 7, 8 ద్వారా క్లెయిమ్స్ సమర్పించవచ్చు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్


