సమసమాజ స్థాపనకు పూలే కృషి మరవలేనిది | - | Sakshi
Sakshi News home page

సమసమాజ స్థాపనకు పూలే కృషి మరవలేనిది

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: సమసమాజ స్థాపనకు మహాత్మా జ్యోతిరావుపూలే చేసిన కృషి మరవలేదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్లలో గ్రామ సర్పంచ్‌ వాసుదేవుడు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్త సమస్యలకు విద్యతోనే పరిష్కారం లభిస్తుందని నమ్మి, అన్ని వర్గాల కోసం పాఠశాలలు, హాస్టళ్లను నిర్మించి విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని స్థాపించుకోవడం భారత విద్యాజ్యోతిని నిలబెట్టుకోవడమేనని అన్నారు. కార్యక్రమంలో మణ్యపురెడ్డి, శ్రీశైలం యాదవ్‌, రాములు, పాండు, బాబురావు, తిరుపతయ్య, శంకర్‌రెడ్డి, నర్సింహ, కృష్ణయ్య, స్వామి జావుల బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement